Thursday, April 18, 2024

ఆన్‌లైన్‌లో ‘అవతార్2’ బుకింగ్స్ ఓపెన్..

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘అవతార్2’ సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో 2డీ, 3డీలో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 2డీలో టిక్కెట్ ధర రూ.295 ఉండగా, 3డీలో రూ.325గా చూపిస్తోంది. మూవీ టికెట్స్ అలా ఓపెన్ అయ్యాయో లేదో బుకింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఇంకా 4డీలో అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ టికెట్లు కూడా విడుదల చేయనున్నారు. కాగా, డిసెంబరు 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలకు రెండు వారాల ముందే బుకింగ్స్ ఓపెన్ చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement