Thursday, November 14, 2024

T20 WC | ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ షో… శ్రీలంకపై ఘన విజయం

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ఆస్ట్రేలియా భోణీ కొట్టింది. శ్రీలంక‌తో జ‌రిగిన‌ తొలి మ్యాచ్‌లో ఘన విజ‌యం సాధించింది. తొలుత బంతితో… ఆ త‌రువాత బ్యాట్ తో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టుకు ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో శ్రీలంక జ‌ట్టు 97 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

అనంతరం స్వల్ప లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 14.2 ఓవర్లలోనే టార్గెట్‌ను చేదించి.. 6 వికెట్ల‌తో విజయం సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ (43 నాటౌట్) ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇక ఎల్లీస్ పెర్రీ (17), ఆష్లీ గార్డనర్ (12) పరుగులు చేశారు.

అంత‌క‌ముందు పేస‌ర్ మేఘ‌న్ ష‌ట్(3/12), స్పిన్న‌ర్ సోఫీ మొలినెక్స్(2/20)లు చెల‌రేగ‌డంతో శ్రీలంక జట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 97 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. శ్రీలంక బ్యాటర్లలో హ‌ర్షిత స‌మ‌ర‌విక్ర‌మ‌(23), నీలాక్షి డిసిల్వా(29 నాటౌట్‌)లు మాత్ర‌మే ఆసీస్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొని కాసేపు క్రీజులో నిల‌బ‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement