Thursday, April 18, 2024

డేవిడ్‌ వార్నర్‌ అసంతృప్తి

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆస్ట్రేలియాక్రికెట్‌ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాల్‌ టాంపరింగ్‌లో దోషిగా తేల్చి కెప్టెన్సీ చేపట్టకుండా జీవితకాలం నిషేధాన్ని ఎదుర్కొంటున్న వార్నర్‌ నిషేధాన్ని తొలగించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాను వేడుకున్న వార్నర్‌ తాజాగా ఆ దేశ క్రికెట్‌ బోర్డుపై అగ్రహం వ్యక్తం చేశాడు. ఇక కెప్టెన్సీ బాధ్యతలను తీసుకోవాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పాడు. కెప్టెన్సీపై జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలని రివ్యూ పిటిషన్‌ వేసిన వార్నర్‌ దీనిపై ఏర్పాటైన స్వతంత్య్ర ప్యానల్‌ కేసు
విచారణను బహిరంగంగా చేపట్టాలని నిర్ణయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.

రివ్యూ పిటిషన్‌ను విరమించుకున్నట్లు ప్రకటించాడు. ఆ సందర్భంగా ఆసిస్‌ క్రికెట్‌ బోర్డు స్వతంత్య్ర ప్యానెల్‌ కౌన్సిల్‌ సహాయక సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వార్నర్‌ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement