Tuesday, October 26, 2021

చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఇలా మాట్లాడరు: అచ్చెన్నాయుడు

సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్ పోసాని అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. జుగుప్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను వైసీపీ నేతలు మంటగలుపుతున్నారని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళి చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ ఎందుకు బహిరంగంగా వారించలేదు అని అచ్చెన్నాయుడు నిలదీశారు. సామాన్యులు వినలేని..మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ ఆనందంలో మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News