Wednesday, April 24, 2024

అట‌ల్ బిహారీ వాజ్ పేయి బ‌యోపిక్.. హీరో ఎవ‌రో తెలుసా

ర‌విజాద‌వ్ డైరెక్ష‌న్ లో భార‌త మాజీ ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి బ‌యోపిక్ రూపొంద‌నుంది.ఈ సినిమా ప్రకటించినప్పుడు చిత్రబృందం వాజ్‌పేయీ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది క్లారిటీ ఇవ్వలేదు. కాగా తాజాగా ఈ సినిమా కథానాయికుడిని మేకర్స్ ప్రకటించారు. వాజ్‌పేయీ పాత్రలో మిర్జాపూర్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠీ నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.ఈ సందర్భంగా వాజ్‌పేయీ పాత్రలో నటించడంపై పంకజ్‌ త్రిపాఠి మాట్లాడుతూ ‘వాజ్‌పేయీ కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు.. మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి గొప్ప నాయకుడి పాత్రలో నటించడానికి అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు’ పంకజ్‌ తెలిపాడు. ఈ చిత్రాన్ని వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement