Thursday, April 18, 2024

ప్ర‌స్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.. హీరో ఉపేంద్ర‌

సినిమా షూటింగ్ లోకేష‌న్ లో నిన్న అస్వ‌స్థ‌త‌కి గుయ్యారు క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర‌. కాగా త‌న ఆరోగ్యంపై ఆయ‌న స్పందించారు. ఈ సంద‌ర్భంగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఓ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను ‘యూఐ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఆయన తెలిపారు. షూట్ చేస్తున్న లొకేషన్లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కొంచెం ఇబ్బందికి గురయ్యానని, దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని చెప్పారు. ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారంటూ నిన్న సాయంత్రం నుంచి వార్తలు వెల్లువెత్తుతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడ్డారని, చిత్ర బృందం ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిందించిందని వార్తలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement