Sunday, February 5, 2023

22న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎగ్జామ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పరీక్ష ఈనెల 22న జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఏడు జిల్లాల్లో 176 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు వెల్లడించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, హన్మకొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఐడీ కార్డును తెెచ్చుకోవాలని సూచించారు. ఉదయం సెషన్‌లో పేపర్‌-1, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్‌-2 పరీక్ష జరగనుందన్నారు. హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోనివారు ఇప్పటికైనా చేసుకోవాలని అభ్యర్థులను అధికారులు ఈమేరకు సూచించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement