Thursday, November 7, 2024

TG | ఏసీబీ అధికారులకు చిక్కిన‌ ఏఎస్ఐ మధుసూదన్..

మేడ్చల్, (ప్రభన్యూస్) : మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ మధుసూదన్ ఏసీబీ ట్రాప్ లో పడ్డారు. వివరాల ప్రకారం సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ మధుసూదన్ ఒక కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ మంజూరి చేసే విషయంలో రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో స్టేషన్ బెయిల్ కోసం ఏఎస్ఐ మధుసూదన్ చేసిన డిమాండ్ విషయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఎస్ఐ మధుసూదన్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement