Saturday, April 20, 2024

కర్ణాటకలో మరో రాసలీలల వైరల్ వీడియో

కర్ణాటకలో మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల వీడియో బయటకు వచ్చి ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఈ ఘటనను మరువక ముందే కర్ణాటకకు సంబంధించి మరో రాసలీలల వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది ఓ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త అని తెలుస్తోంది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చి గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీనిపై కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. తాజా వీడియోపై పోలీసులు చర్యలు తీసుకున్నారా? అన్న సంగతి తెలియరాలేదు. కాగా దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement