Tuesday, April 23, 2024

ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ వ‌స్తుంద‌నుకుంటున్నా – ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై ఎంతో మంది ప్ర‌ముఖులు త‌మ స్పంద‌న‌ని తెలియ‌జేశారు.ఇక ఈ చిత్రం ఆస్కార్ బ‌రిలో నిలిచింద‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండ‌గా ఆర్ ఆర్ ఆర్ సినిమాపై త‌న స్పంద‌న‌ని తెలిపారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.ఈ చిత్రం హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను కూడా ఆకట్టుకుంటుంద‌ని అన్నారు . గిరిపుత్రులు బ్రిటీష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం కచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

బాలీవుడ్ ఎంటర్టయిన్ మెంట్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఇటీవల ఓ కథనంలో టాలీవుడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రముఖంగా పేర్కొంది. ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లను పొందే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గీతం కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ పోటీ పడొచ్చని ‘వెరైటీ’ పేర్కొంది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లోనూ సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటి చెబుతున్నాయ‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement