Sunday, December 3, 2023

ఇప్పటికైతే అన్షు మాలిక సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు.. మంత్రి రోజా

ఎప్పటి నుంచో మంత్రి..నటి రోజా కుమారై అన్షుమాలిక సినిమాల్లోకి వస్తుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా నలె వ్యాఖ్యలు చేశారు. తన కూతురు సినీ ఎంట్రీపై స్పందించారు . చదువుల్లో ముందున్న అన్షుమాలిక చిన్నవయసులోనే సామాజిక సేవల పట్ల ఆకర్షితురాలై ఓ స్వచ్ఛంద సంస్థకు సహాయసహకారాలు అందిస్తోంది.

- Advertisement -
   

రోజా బాటలోనే అన్షుమాలిక కూడా సినీ రంగంలోకి వస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఓ హీరో కుమారుడి సరసన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై మంత్రి రోజా స్పందించారు.యాక్టింగ్ కెరీర్ ఎంచుకోవడం తప్పు అని ఎప్పుడూ అనను. నా కూతురు, కొడుకు గనుక యాక్టింగ్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురుకి బాగా చదువుని సైంటిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను బాగా చదువుకుంటోంది. ఇప్పటివరకైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ఒకవేళ తను సినిమాల్లోకి వస్తే మాత్రం ఓ తల్లిగా ఆశీర్వదిస్తాను, అండగా నిలబడతానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement