Thursday, April 25, 2024

హీరోగా వ‌స్తాడ‌నుకుంటే.. డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇస్తోన్న షారుక్ త‌న‌యుడు

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు.. హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌నుకుంటే.. డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు… వచ్చే ఏడాది ఈ సిరీస్ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. తన కుమారుడు ఆర్యన్ స్ర్కిప్ట్ పూర్తి చేశాడని, దాన్ని చూసేందుకు వేచి ఉండలేకపోతున్నానని గౌరీ ఖాన్ పేర్కొన్నారు.షారూక్ నట వారసుడు ఆయన కుటుంబం నుంచి హీరోగా వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

కానీ, ఆర్యన్ తెరంగేట్రం చేయబోతోంది హీరోగా కాదు.. దర్శకుడిగా. సొంతగా కథ రాసుకొని ఆర్యన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని ఆర్యన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తొలి ప్రాజెక్టు కోసం స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఓ ఫీచర్ ఫిల్మ్ కోసం ఆర్యన్ ఈ కథ రాసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ఓ వెబ్ సిరీస్ అని సమాచారం. ఆర్యన్ దర్శకుడిగా, షో రన్నర్ గా వెబ్ సిరీస్ ను తెరకెక్కించబోతున్నారు. షారూక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంతో కలిసి అమెజాన్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement