Friday, March 29, 2024

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఘ‌ట‌న‌లో- గ‌ల్లంత‌యిన వారిలో ఏడుగురి అచూకీ ల‌భ్యం

ఏడుగురు కూలీల‌ను ర‌క్షించారు ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వారు. వారికి వైద్య స‌హాయం అందించామ‌ని కురుంగ్ కుమే జిల్లా డీఎం నిఘి బెంగియా తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో జూలై 13వ తేదీన 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. గ‌ల్లంతైన వారిలో ఏడుగురి ఆచూకీని పోలీసులు గుర్తించారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. వైద్య సహాయం, ఇతర అవసరాల కోసం కూలీలను ఒకే చోట ఉంచామ‌న్నారు. జిల్లా యంత్రాంగం కూడా అవసరమైన సహాయం అందిస్తోందని తెలిపారు. వారికి సహాయం చేయడానికి వైద్య బృందాలను పంపామ‌నీ, తప్పిపోయిన కార్మికుల కోసం IAF హెలికాప్టర్లు కూడా అన్వేషణ మరియు రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. గ‌ల్లంతైన 19 మంది కార్మికులను అస్సాం నుండి BRO కాంట్రాక్టర్ బెంగియా బడో యొక్క సబ్-కాంట్రాక్టర్లు తీసుకువచ్చారని, ఈ మేర‌కు జూలై 13 న కొలోరియాంగ్ పోలీస్ స్టేషన్‌లో 19 మంది కార్మికుల తప్పిపోయిన ఫిర్యాదు చేశార‌ని తెలిపారు. SDRFతో సహా స్థానిక పరిపాలన సిబ్బంది రెస్క్యూ పనిలో నిమగ్న‌మైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement