Friday, February 3, 2023

పాలధారలా ఆ జలపాతం.. ట్వీట్ చేసిన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం

జలపాతం అనగానే నయాగరా గుర్తుకొస్తుంది. అయితే, పర్యాటకులను కనువిందు చేసే జలపాతాలు మనదేశంలోనూ చాలానే ఉన్నాయి. అలాంటి జలపాతాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిబంగ్‌ వ్యాలీ వాటర్‌ఫాల్స్‌ ఒకటి. ఈ జలపాతం ప్రస్తుతం ప్రకృతి ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాలధారలా కొండపై నుంచి కిందకు జాలువారుతూ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. పాలా..? నీళ్లా..? అని భ్రమపడేలా ఉన్న ఈ జలపాతానికి సంబంధించిన వీడియోను అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. ‘దేఖో అప్‌నా దేశ్‌’ క్యాంపెయిన్‌లో భాగంగా ఆయన ఈ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement