Friday, March 29, 2024

సీబీఎస్‌ఈ ప్రశ్నపై దుమారం.. గుజరాత్‌ అల్లర్ల ప్రస్తావన

న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల్లో వచ్చిన ఓ ప్రశ్నపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. 2002, గుజరాత్‌లో జరిగిన అల్లర్లపై ఈ ప్రశ్న ఉండటం గమనార్హం. ఇటీవల 12వ సోషియాలజీ పేపర్‌లో 2002 అల్లర్ల సమయంలో గుజరాత్‌ రాష్ట్రాన్ని ఏ పార్టీ పాలిస్తోంది..? అంటూ ప్రశ్న వచ్చింది. ఆప్షన్‌ ఆధారిత ప్రశ్న కావడంతో.. సమాధానం ఎంచుకునేందుకు కింద నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్‌, డెమోక్రాట్లు, రిపబ్లికన్‌లు అనే ఆప్షన్లు ఉన్నాయి.

ఈ ప్రశ్నపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగడంతో.. తప్పు తెలుసుకున్న బోర్డు ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది. ఇది ఎంతో సున్నితమైన అంశమని, మానిన గాయాన్ని మళ్లిd గుర్తు చేయడం అవుతుందని పలువురు చెప్పుకొచ్చారు. ఇది నిపుణుల మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement