Monday, April 15, 2024

అరే ఏంట్రా ఇది అంటూ.. ష‌ణ్ముఖ్ పై ట్రోల్స్

అరే ఏంట్రా ఇది అంటూ ష‌ణ్ముఖ్ డైలాగ్‌తోనే సెటైర్లు పేలుస్తున్నారు నెటిజ‌న్స్. గత కొంత కాలంగా మరో అమ్మాయితో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నాడు యూట్యూబ‌ర్ షణ్ముఖ్‌. ఫణి పూజిత అనే యూట్యూబ్‌ యాక్ట్రెస్‌తో ఆయన వరుసగా యూట్యూబ్‌ వీడియోలు చేస్తున్నారు. రొమాంటిక్‌గా ఉండే ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ జంట కూడా తరచూ చర్చనీయాంశంగా మారుతుంది. షణ్ముఖ్‌ కొత్త లవర్‌ ని పట్టాడనే కామెంట్లు ఊపందుకున్నాయి. దీనికితోడు ఆయన పూజితతో కలిసి రొమాంటిక్‌ సాంగ్‌లు చేస్తుండటం, అందులో మరింతగా రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతుండటంతో ఫ్యాన్స్, నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.

తాజాగా షణ్ముఖ్‌, ఫణి పూజిత కలిసి చేసిన అయ్యయ్యో అనే యూట్యూబ్‌ సాంగ్‌ బాగా ట్రెండ్‌ అవుతుంది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇందులో షణ్ముఖ్‌, పూజిత రొమాన్స్ లో పీక్‌లోకి వెళ్లారు. ఇద్దరు హగ్‌ చేసుకుంటూ, రాసుకుంటూ పూసుకుంటూ కనిపించారు. అంతేకాదు షణ్ముఖ్‌ మరో అడుగు ముందుకేసి వరుసగా ముద్దుల వర్షం కురిపించాడు. ఆమెతో ఇంటెన్స్ రొమాన్స్ తో రెచ్చిపోయాడు. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నెటిజన్లు, దీప్తి లవర్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement