Wednesday, April 24, 2024

పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ..

  • 17 వేల ఉద్యోగాలకు 14 లక్షల దరఖాస్తులు
  • అర్ధరాత్రి ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ప్రకటించిన ఉద్యోగ నియామకాల ప్రక్రియకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నెల 2 వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం అర్థరాత్రితో ముగిసింది. దాదాపు 17 వేల పై చిలుకు ఉద్యోగాల కోసం నియామక బోర్డు దరఖాస్తులను ఆహ్వానించగా దాదాపు 14 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రితో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుండటంతో మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నది శుక్రవారం సాయంత్రం వరకు తెలియవచ్చని అధికారులు చెబుతున్నారు.


ఏ పోస్టుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలతో పాటు ఏ కెటగిరికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారన్న సమగ్ర వివరాలన్నీంటిపై మరో రెండు రోజులలో స్పష్టత రానుందని చెబుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్పందన వచ్చిందంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత పరిశీలన ప్రక్రియను వేగవంతం చేస్తామని, మొత్తంగా ఆగస్టు మాసంలో ప్రిలిమినరీ పరీక్షలను పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి కల్లా నియామక ప్రక్రియను ముగించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement