Thursday, April 25, 2024

Smart Tech : ఆపిల్ బిగ్ అప్డేట్.. వాయిస్ అసిస్టెంట్ సిరి కమాండ్‌ కంట్రోల్ మార్చనున్న కంపెనీ

అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ తన వాయిస్ అసిస్టెంట్ సిరి వేక్ కమాండ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం, ఐఫోన్‌, ఆపిల్ స్పీకర్‌లలో వాయిస్ అసిస్టెంట్‌ను ట్రిగ్గర్ చేయడానికి వినియోగదారులు సిరి కంటే ముందు ‘హే’ అని జోడించాలి. రాబోయే రెండేళ్లలో, Apple వేక్ కమాండ్ నుండి ‘హే’ని తీసేయాడానికి ఆపిల్​ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తో్ంది.

ఆపిల్ కొన్ని నెలలుగా ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోందని సమాచారం. వచ్చే ఏడాది లేదా 2024లో దీనికి సంబంధించిన అప్డేట్ ను విడుదల చేయవచ్చని టెక్​ ఎక్స్​పర్ట్​లు అంటునున్నారు. ఇప్పుడున్న 2 వర్డ్ వేకప్ యాక్టికేషన్ కన్నా.. సింగిల్ వర్డ్ వేక్ అప్ యాక్టివేషన్ లైన్ కి మారడం వలన ఆపిల్, అమెజాన్- అలెక్సాతో పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. ఇలా చేయడం ద్వరా.. ఆపిల్- సిరి యాక్టివేషన్ Google అసిస్టెంట్ కంటే ముందు ఉంటుంది. googleని యాక్టివేట్ చేయడానికి ‘Ok Google’ లేదా ‘Hey Google’ అనే పదాలు అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement