Friday, December 6, 2024

AP – ‘సింహం సింగిల్‌గా రావడం అంటే ఇదే’

అమరావతి

ఎపీ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాల సందర్భంగా హోంమంత్రి అనిత వైసీపీ పార్టీ శ్రేణులు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చంద్రబాబు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరల అసెంబ్లీకి వచ్చారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం జగన్ బడ్జెట్ సమావేశాలకు రాకుండా ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు.’సింహం సింగిల్‌గా రావడం అంటే ఇదే’ నని చంద్రబాబు గారిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

నక్కతెలివితేటలతో ఎమ్మెల్యేలను ఇటు నుంచే అటు లాగేశావ్,బూతే సిగ్గుపడేలా బూతులు తిట్టించావ్, ప్రతిపక్ష నాయకులను ఈడ్చి పడేయమని స్పీకర్ ద్వారా అధికారికంగా ఆదేశాలిప్పించావ్ , స్పీకర్ వైఫై జోన్ లోకి వెళ్లిన అందరినీ సస్పెండ్ చేయించావ్, అయినా సాకులు చెప్పలేదు, నాలుగు పక్కలా చుట్టుముట్టి కాలకేయుల్లా మీద పడే మీ ఉన్మాద గుంపుల మద్యలోకి ఒక్కడిగా వచ్చారు, ప్రజల తరపున ఒక్కడై గొంతు విప్పారు, ప్రజా గళం బలంగా వినిపించారు. అరెస్ట్ అయినా మొక్కవోనిదీక్షతో ముందడుగేశారు. అదీ నిబద్ధత, అదీ ధైర్యం, . చంద్రబాబు సాకులు చెప్పలేదు. ఒక్కడిగా వచ్చారు. అదీ సింహం సింగల్ గా రావడం అంటే, అదీ ధైర్యం అంటే. ఎవరు సింహమో.. ఎవరు మేకవన్నెపులులో వేరే చెప్పాలా? ఎనీ డౌట్స్? అని చంద్రబాబు పాత ఫొటోను ట్వీట్ చేశారు! ‘

Advertisement

తాజా వార్తలు

Advertisement