Thursday, November 7, 2024

AP – ఆ రెండు కేసులు సిఐడికి అప్పగింత

టిడిపి కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులు
పోలీస్ ల నుంచి సిఐడికి కేసుల బదిలీ
నేడు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి – తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు కేసులకు సంబంధించిన ఫైళ్లను సీఐడీకి అందిస్తారు. 2021 అక్టోబర్ 19న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడి చేశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వైఎస్ఆర్ సీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబు నివాసంపై మాజీ మంత్రి జోగి రమేశ్ దాడికి యత్నించారని అప్పట్లో పోలీసులకు టీడీపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రెండు కేసుల దర్యాప్తులో కదలిక వచ్చింది.

ఈ కేసులో నందిగం సురేశ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement