Saturday, October 5, 2024

AP – నేడు జనసేన లో చేరనున్న బాలినేని, సామినేని, కిలారు

అమరావతి – ఇవాళ జనసేనలో కీలక వైసీపీ నేతలు చేరనున్నారు. జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నారు వైసీపీ నేతలు బాలినేని, సామినేని, కిలారు రోశయ్య. ఇవాళ మధ్యాహ్నం 12 సమయంలో.. జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నారు .వైసీపీ నేతలు బాలినేని, సామినేని, కిలారు రోశయ్య..

ఇది ఇలాఉంటే త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతోన్నాయి జనసేన వర్గాలు. కాగా.. జగన్ మోహన్ రెడ్డి నిర్నయాలు, ప్రవర్తన నచ్చకనే.. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు వైసీపీ నేతలు బాలినేని, సామినేని, కిలారు రోశయ్య. దీంతో జనసేనలోకి వెళుతున్నారు.

భారీ ర్యాలీ కి నో

సాధారణంగా ఎవరైనా నేత ఓ పార్టీని వీడి మరో పార్టీలో చేరినప్పుడు భారీ బలప్రదర్శన ఉంటుంది. ఓ పెద్ద సభ, వాహనాలతో భారీ కాన్వాయ్ సాధారణంగా కనిపించే దృశ్యాలు. అయితే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం అత్యంత నిరాడంబరంగా నేడు జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఒంగోలులో సభ పెట్టి, అనంతరం భారీ ర్యాలీగా మంగళగిరి తరలివచ్చి పార్టీ తీర్థం పుచ్చుకోవాలని భావించారు. అయితే, ఆయన ఆశలను పార్టీ అధిష్ఠానం తుంచేసింది.

- Advertisement -

సభ, బల ప్రదర్శన అవసరం లేదని, ఒక్కరే మంగళగిరి వచ్చి పార్టీలో చేరాలని ఆదేశించింది. దీంతో తొలుత నిరుత్సాహానికి గురైన ఆయన ఆ తర్వాత అందుకు ఓకే చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement