Friday, December 6, 2024

AP – ‘ఆర్ఆర్ఆర్’ లా రఘురామ సంచలనాలు సృష్టించాలి: చంద్రబాబు

అమరావతి: ‘ఆర్ఆర్ఆర్’ ఎంత సంచలనం సృష్టించిందో.. రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామ అంత సంచలనాలు సృష్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. : ఏపీ ఉపసభాపతిగా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అనంత‌రం చంద్ర‌బాబు,ప‌వ‌న్ క‌ల్యాణ్ లు ర‌ఘ‌రామ కృష్ణ‌రాజును స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు తీసుకెళ్లి ఆ స్థానంలో కూర్చొబెట్టారు.. ఈ సంద‌ర్భంగా రఘ‌రామ ముఖ్య‌మంత్రి పాదాల‌కు న‌మ‌స్క‌రించారు.. డిప్యూటీ స్పీక‌ర్ గా ఎన్నికైన ఆయ‌న‌ను మంత్రులు , కూట‌మి స‌భ్యులు అభినందించారు..

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, “నాటునాటు పాట ఎంత పాపులర్ అయిందో ఆర్ఆర్ఆర్ రచ్చబండ అంత పాపులర్ అయింద‌న్నారు. అయిదేళ్లు జ‌గ‌న్ పై అలుపెర‌గ‌ని పోరాటం చేశార‌ని ప్రశంసించారు.. ఈ సంద‌ర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాన‌ని అన్నారు. . తెలుగుబిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ.. స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చార‌ని ప్ర‌శంసించారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తే సంతోషం కలుగుతోంది” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement