Saturday, May 27, 2023

పవన్ ను కెలికి మరీ వైసీపీ నేతలు తిట్టించుకున్నారు : రఘురామ కృష్ణంరాజు

వైసీపీ నేత‌లు అన‌వ‌స‌రంగా ప‌వ‌న్ ను కెలికి మ‌రీ తిట్టించుకున్నార‌ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు పై రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రూంలో పెట్టి పిల్లిని కొడితేనే కళ్లు పీకుతుంది.. అదే పులిని కొడితే ఏమవుతుంది? అన్నారు. పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ అదే చేసిందని కూడా ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్ ను అనవసరంగా కెలికిన వైసీపీ నేతలు ఆయనతో తిట్లు తిన్నారని అన్నారు. పవన్ కల్యాణ్ చేసుకున్న 3 పెళ్లిళ్లను చేసుకుంటే అది ఆయ‌న వ్య‌క్తి గ‌త విష‌య‌మ‌న్నారు. విడాకులు ఇచ్చిన త‌రువాతే తాను మ‌రో పెళ్లి చేసుకున్నాడ‌ని, వైసీపీ నేతలు తమ పార్టీ అధినేత ఇంటిలో జరిగిన పెళ్లిళ్లపై ఎందుకు నోరిప్పరని ప్రశ్నించారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి తొలి భార్య బతికుండగానే… ఆమెకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు. వెంకటరెడ్డి మాదిరిగా కాకుండా పవన్ విడాకులిచ్చాకే తదుపరి పెళ్లి చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా రెండు పెళిళ్లు చేసుకున్నారు కదా? అని ఆయన అన్నారు. తొలుత మేనమామతో పెళ్లి జరగగా… ఆ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పిన షర్మిల… బ్రదర్ అనిల్ కుమార్ ను పెళ్లి చేసుకున్నారని ఆయన చెప్పారు. షర్మిల రెండు పెళ్లిళ్లు చేసుకున్నారేమిటని ఇప్పటిదాకా ఆమెను ఎవరూ ప్రశ్నించలేదు కదా? అని కూడా ఆయన అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement