Friday, October 11, 2024

Big story | మహిళా పోలీసులకు జాబ్‌ చార్ట్‌.. ఎస్‌ఐ, సీఐ స్థాయికి ప్రమోట్‌

అమరావతి, ఆంధ్రప్రభ : పోలీసులతో పాటు సమాంతర విధులు నిర్వహించేందుకు జగన్‌ సర్కార్‌ ప్రయో గాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా సంరక్షణ కార్యదర్శుల వ్యవస్థðను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో మహిళల రక్షణ, భద్రతే ప్రధానంగా సేవలందిస్తున్న మహిళా పోలీసులకు సంబంధించి పదోన్నతులపైనా దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసు విధులకు దూరంగా పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసులకు విధులకు సంబంధించి నిర్దిష్టత తీసుకువచ్చేదందుకు కసరత్తు జరుగుతోంది.

రాష్ట్రంలో వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్ర స్తుతం 15 వేలమంది మహిళా పోలీసులు సేవలందిస్తున్నారు. పోలీసు విధుల్లో భాగంగా క్షేత్రస్థాðయిలో శాంతి భద్రతలపై అధ్యయనం, నిర్దిðష్ట సమాచార సేకరణ, నేరాల నియంత్రణకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ, మహిళలు, బాలికల రక్షణకు చేపట్టాల్సిన చర్యలు, వారిలో అవగాహన తదితర బాధ్యతలతోపాటు బందోబస్తు విధులు, పోలీసుల రోజువారీ కార్యకలాపాల్లో భాగస్వామ్యం, కోర్టు, స్టేషన్‌ డ్యూటీ వంటి విధులు మొన్నటి వరకు నిర్వహించేవారు.

అయితే మహిళా పోలీసుల నియామకం, వారి యూనిఫాం, విధులకు సంబంధించి పలు అభ్యంతరాలు తెర మీదకు వచ్చిన నేపధ్యంలో వీరి వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్‌లు కూడా దాఖలయ్యాయి. దీనిలో న్యాయస్థానం ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారి విధులకు సంబంధించి ఇటీవల ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసులను పోలీసు విధులకు వినియోగించవద్దంటూ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి గతంలో పోలీసు శాఖను ఆదేశించారు. ఈమేరకు రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు, రేంజ్‌ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర శాఖలతో సమన్వయం వంటి సేవలే మహిళా పోలీసు ఏర్పాటు ఉద్దేశమని, బందోబస్తు, రిసెప్షన్‌, శాంతిభద్రతల పరిరక్షణ విధులకు వారిని ఇకనుంచి వినియోగించవద్దని, పోలీసు స్టేషన్లకు పిలవరాదని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం మహిళా పోలీసులు ఆ విధులకు దూరంగా జరిగారు. దీంతో గ్రామ, మండల, పట్టణస్థాðయిలో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని మహిళలు, చిన్నారులకు సంబంధించి ముడిపడి ఉన్న అంశాల కు వారిని వినియో గిస్తున్నారు.

మున్సిపల్‌, పంచాయితీ శాఖల పరిధిలోని సంబంధిత సేవలు, కొత్తగా ఇటీవల సర్వేలు, ఎలక్ట్రోల్‌ విధులు వంటివి నిర్వహిస్తున్నారు. అయితే మహిళా పోలీసుల వ్యవస్థ ఏర్పాటు చేసే సమయంలోనే వారి విధులు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఇప్పటికీ నిర్దిష్ట విధులకు సంబం ధించి స్పష్టం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మహిళా పోలీస్‌కు సంబంధించిన జాబ్‌ ఛార్ట్‌ను పూర్తి స్థాయిలో తయారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

పదోన్నతులపైనా దృష్టి

ఇక మహిళా పోలీసుల పదోన్నతులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. పూర్తిస్థాðయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడిన మీదట ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. కనీసం ఆరేళ్ల పాటు మహిళా పోలీసుగా పనిచేసిన వారు, నియామక సమయంలో వారికి ఎంపిక చేసేందుకు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మెరిట్‌ ఆధారంగా పదోన్నతులు కల్పించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా మహిళా పోలీసుగా పనిచేస్తున్న సర్వీసు పరంగా వారి పనితీరును సైతం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు మహిళా పోలీసులకు సీనియర్‌ మహిళ పోలీసుగా పదోన్నతి కల్పిస్తారు. వీరిని ఎస్‌ఐ ర్యాంకు అధికారిగా పరిగణిస్తారు. ఆ తర్వాత సీఐ ర్యాంకు అధికారి వరకు ఈ పదోన్నతులు ఉండనున్నాయి. ఇలా ఏఎస్‌ఐ క్యాడర్‌తో సమానంగా లభించే పదోన్నతి పొందిన మహిళా పోలీసులు సీఐ కార్యాలయంలో, ఎస్‌ఐ పదోన్నతి పొందిన వారు డిఎస్‌పి కార్యాలయంలో, సీఐ క్యాడర్‌లో పదోన్నతి పొందిన వారు ఎస్పీ కార్యాలయంలో పనిచేసేలా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఆయా క్యాడర్‌లో ఉన్న వారంతా విధులకు సంబంధించి జాబ్‌ డ్యూటీలో స్పష్టత ఇచ్చేలా నిర్దిష్ట విధి విధానాల ఖరారుకు కసరత్తు జరుగుతున్న క్రమంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం డీజీపీ ముంగిట ఉన్నట్లు ఆయా వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement