Saturday, April 20, 2024

ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. అంతలోనే రీకాల్ చేసిన హైకోర్టు

అమరావతి: హైకోర్టు తీర్పును అమలు చేయలేదని ఏపీలోని ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష పడింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇవాళ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌ కోర్టుకు హాజరయ్యారు. విచారణ చేసిన హైకోర్టు వారిద్దరికీ వారంపాటు జైలు శిక్ష విధించింది. 36 మందిని క్రమబద్ధీకరిచాలని గతంలో ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమల చేయలేదని ఇద్దరు అధికారులకు వారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

అయితే ఐఏఎస్ గిరిజా శంకర్, చిరంజీవిలకు వేసిన జైలు శిక్షను కాసేపటికే హైకోర్టు రీకాల్ చేసింది. జైలు శిక్ష తీర్పును హెచ్చరికగా పరిగణించాలని ధర్మాసనం పేర్కొంది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించినా చర్యలు తీసుకోనందుకు కోర్టు జైలుశిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులను గురువారం సాయంత్రంలోగా అమలు చేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో హైకోర్టు జైలుశిక్షను రీకాల్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement