Sunday, September 24, 2023

Big story | శరవేగంగా ల్యాండ్‌ రీ సర్వే.. దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు

అమరావతి, ఆంధ్రప్రభ : అతి తక్కువ వ్యవధిలో వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం ద్వారా నాలుగు వేల గ్రామాల్లో ల్యాండ్‌ రీసర్వే కార్యకలాపాలను పూర్తి చేసిన మొట్ట మొదటి రాష్ట్రంగా ఏపీ రికార్డు సొంతం చేసుకుంది. భూ యజమానుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

ఈ పథకలో భాగంగా రాష్ట్ర సర్వే, సెటిల్‌మెంట్‌ విభాగం పది సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో భూకమత పటం, గ్రామ పటం, భూ హక్కు పత్రం తదితర భూమి రికార్డులలో పాటు అక్షాంశ, రేఖాంశాలను డిజిటల్‌ రూపంలో అందిస్తుండటంతో భూ యజమానులకు ప్రయోజంన కలిగిస్తోంది. ఈ పథకం ద్వారా వ్యవసాయ భూముల సరిహద్దుల్లో ఉచితంగా భూ రక్ష సర్వే రాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ట్యాంపరింగ్‌కు అవకాశం లేని భూమి రికార్డులు సిద్ధమవుతున్నాయి.

- Advertisement -
   

ఈ ప్రక్రియకు అవసరమైన వ్యయాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా సర్వే పూర్లయ్యాక భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం ఉండదు. డబుల్‌ రిజిస్ట్రేష్రన్ల సమస్య అసలే ఉత్పన్నం కాదు. గ్రామ సచివాలయాలు సబ్‌ రిజిస్ట్రార్ర్‌ కార్యాలయాలుగా ఇప్పటికే సేవలు అందిస్తుండటంతో స్థానికంగానే భూమి రికార్డుల నవీకరణ సాధ్య పడుతుంది. రిజిస్ట్రేష్రన్‌ కు ముందే మ్యుటేషన్‌, పట్టా సబ్‌ డివిజన్‌ ప్రక్రియ చేసుకోవచ్చు.

వందేళ్ళ తరువాత సమగ్ర సర్వే

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకం ఎన్‌ టి ఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 2020 డిసెంబరు 21 న ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత దేశంలో సమగ్ర రీసర్వేను చేపట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. భూ హక్కు పత్రం ద్వారా భద్రతను నిర్ధారణ, భూ రక్షా సర్వే రాళ్ళు ద్వారా సరిహద్దు భద్రత కల్పిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భూ రికార్డులను జిపిఎస్‌ కోఆర్డినేట్‌లు, ప్రత్యేక ఐడి నంబర్‌, క్యూ ఆర్‌ కోడ్‌లతో జారీ చేస్తోంది. రెవెన్యూ, సర్వే, పంచాయత్‌ రాజ్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేష్రన్‌, రిజిస్ట్రేష్రన్‌ శాఖల సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ చురుకుగా సాగుతోంది. వ్యవసాయ భూములతో పాటు- గ్రామ స్థలాలు, మునిసిపల్‌ భూములను కూడా మొదటిసారిగా సర్వే చేసి, గృహస్థులందరికీ యాజమాన్య ధృవీకరణ పత్రం కూడా జారీ చేస్తున్నారు.

ప్రపంచస్థాయి సాంకేతికత

రాష్ట్రంలో రీసర్వే కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రపంచస్థాయి సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఎయిర్‌ క్రాప్ట్‌ , హెలికాప్టర్‌, డ్రోన్‌, రోవర్‌, కార్స్‌ నెట్‌వర్క్‌ వంటి అత్యంత అధునాతన హైబ్రిడైజ్డ్‌ సాంకేతికతల సాయంతో రైతుకు స్పష్టమైన సరిహద్దులను అప్పగిస్తున్నారు. ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌ల తయారీలో భాగంగా ఎయిర్‌ క్రాప్ట్‌, హెలికాప్టర్‌, డ్రోన్‌లు వినియోగిస్తుండగా.. కార్స్‌ నెట్‌వర్క్‌ రోవర్లు తదితర అంశాలను గ్రౌండ్‌ ట్రూథింగ్‌, గ్రౌండ్‌ వాలిడేషన్‌ కోసం ఉపయోగిస్తున్నారు. డ్రోన్‌ ్లఫ వివరాలను పరిశీలిస్తే మొత్తం రాష్ట్రంలో మొత్తం 17,595 గ్రామాలు ఉండగా, డ్రోన్‌ ్లఫ వర్తించని గ్రామాలు 4135 ఉన్నాయి.

నికరంగా 13,460 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా వాటిలో 12,836 గ్రామాల్లో పూర్తయింది. అంటే 95 శాతం గ్రామాలలో పూర్తి కాగా కేవలం ఐదు శాతం గ్రామాల్లో మాత్రమే డ్రోన్‌ ్లఫ మిగిలి ఉంది. ఇలా మిగిలిన 624 గ్రామాల్లో అక్టోబరు 15 నాటికి డ్రోన్‌ ్లఫ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సర్వే , సెటిల్‌మెంట్‌, భూమి రికార్డులు కమీషన్‌ సిద్దార్ధ జైన్‌ ఈ సందర్భంగా తెలిపారు.

ఆన్‌ లైన్‌ మాధ్యమాల ద్వారా వివరాల సేకరణ

పట్టాదార్లు వ్యక్తిగతంగా రీసర్వేకు ప్రక్రియకు హాజరు కాలేని పక్షంలో, వారికి రీసర్వేకు హాజరయ్యేందుకు విభిన్న అవకాశాలు అందుబాటులో ఉంచారు. వాట్సాప్‌ వీడియో కాల్‌, జూమ్‌, ఏదైనా ఇతర వీడియో దృశ్య శ్రవణ మాధ్యమ సాంకేతికతల ద్వారా రీసర్వే బృందాలు రైతుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్‌ చేస్తున్నాయి. మరోవైపు సర్వే, ఆర్‌ఓఆర్‌ చట్టం కింద ఉన్న అన్ని అవకాశాలను రైతులు వినియోగించుకునే వెసులుబాటు ఉంది.

భూమికి సంబంధించిన అన్ని సేవలు ఏకీకృతం కాగా, ఏక గవాక్ష విధానంలోకి వచ్చాయి. గ్రామ సచివాలయంలో సమీకృత సర్వే, రిజిస్ట్రేష్రన్‌ మ్యుటేషన్‌ సేవలను అందించడం దేశంలోనే ఇదే మొదటిసారి. ఏపీ రీసర్వే ప్రాజెక్ట్‌ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్రకు రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది.

ముస్సోరీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రీ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేష్రన్‌ మన అధికారులచే ఇతర రాష్ట్రాల వారికి రీ-సర్వే శిక్షణలను ఇప్పిస్తుండటం ప్రత్యేకత. సర్వే డిపార్ట్‌మెంట్‌ 32 డ్రోన్‌లను కొనుగోలు చేసి, 104 మంది సర్వేయర్లకు పైలట్‌లుగా శిక్షణ ఇచ్చి స్వతంత్రంగా డ్రోన్‌ ్లఫ నిర్వహిస్తుుది. 3,240 జిఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లను కూడా కొనుగోలు చేసి రీసర్వేలో ఉపయోగిస్తున్నారు.

విజయవంతంగా మ్యుటేషన్లు

అక్టోబరు 15 నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేష్రన్లు అన్నిగ్రామ సచివాలయాల్లోరిజిస్టేషన్ల ప్రకియ ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్టు సిద్దార్ద్‌ జైన్‌ తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు వెల్లడించారు. ల్యాండ్‌ రీ సర్వేకు సంబంధించి తొలిదశలో నిర్ధేశించుకున్న 2000 గ్రామాల్లో మంచి పురోగతి నమోదయింది.

రెండు లక్షల మ్యుటేషన్లు చేశారు. 4.3 లక్షల కొత్త సర్వే సబ్‌ డివిజన్లు సృష్టించారు. 19 వేల సరిహద్దు వివాదాలు పరిష్కరించారు. 25 లక్షల సరిహద్దు రాళ్లు పాతారు. 7.8 లక్షల బిహెచ్‌ పిలను పంపిణీ చేశారు. రెండో దశలో భాగంగా రెండు వేల గ్రామాలలో సైతం గణనీయంగా ఫలితాలు నమోదయ్యాయి. 2.69 లక్షల మ్యుటేషన్లు పూర్తి కాగా, 4.4 లక్షల వరకు కొత్తగా సర్వే సబ్‌ డివిజన్లు సృష్టించటం సాధ్యపడింది. 26 వేల సరిహద్దు వివాదాలు పరిష్కారానికి నోచుకున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో త్వరిత గతిన సర్వే ఫలాలను రైతులకు అందించాలన్న ధ్యేయంతో ముందడుగు వేస్తున్నామని సిద్దార్ధ జైన్‌ తెలిపారు. ఈనెల 30 నాటికి నాటికి 25.31 లక్షలు స్టోన్స్‌ ప్లాంటేషన్స్‌, 8.5 లక్షల భూ హక్కు పత్రాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని జైన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement