Thursday, March 28, 2024

రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులను ఆర్థికశాఖలో కలుపుతూ ఇచ్చిన జీవో నిలిపివేత..

ఏపీ ప్రభుత్వం పరిపాలనా పరంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లు, వాణిజ్యపన్నులను ఆర్థికశాఖలో కలుపుతూ ఇచ్చిన జీవోను నిలుపుదల చేసింది. ఈ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్లు, వాణిజ్యపన్నుల విభాగాలను ఆర్థికశాఖలో కలుపుతూ కొన్నాళ్ల క్రితమే జీవో జారీ అయింది. వాస్తవానికి ఈ రెండు విభాగాలు రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటాయి. జీవో తీసుకువచ్చిన నేపథ్యంలో, వాణిజ్య పన్నుల శాఖ కమిషనరేట్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డైరక్టరేట్, ఐజీ కార్యాలయాలు, ఏపీ వ్యాట్ ట్రైబ్యునల్ వంటివన్నీ ఆర్థికశాఖ నియంత్రణలో పనిచేస్తాయని జీవో జారీ చేసిన సమయంలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణను సులభతరం చేసేందుకే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. అయితే, ఇప్పటికిప్పుడు జీవోను నిలుపుదల చేయడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్?

Advertisement

తాజా వార్తలు

Advertisement