Tuesday, April 23, 2024

పల్లె వైద్యానికి కొత్త జీవం… ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి ఏపీ సర్కార్‌ చర్యలు

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రజా ఆరోగ్య సమరక్షణకు విశేష కృషి చేస్తున్న పాలకులు ఇప్పుడు మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పల్లె వైద్యానికి కొత్త జీవం తెచ్చి గ్రామీణలకు పూర్తి స్దాయిలో వైద్యం అందించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసెందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకూ ప్రాధమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న సేవలతో పాటు మందులను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఆరోగ్య కేంద్రాలకు ఆధునాతన వైద్య పరికరాలను అందిస్తుంది. గతంలో కేవలం 16 రకాల ఆరోగ్య పరీక్షలే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉండగా, ఆ సంఖ్యను మరింత పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.

63 రకాల రక్త, ఆరోగ్య పరీక్షలను పిహెచ్‌సీ స్దాయిలో తీసుకొచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఆరోగ్య కేంద్రాలకు బయోకెమిస్ట్రీ , ఎలక్ట్రోలైట్‌ ఎనలైజర్‌ లాంటి ఆధునిక పరికరాలను ఒక్కొక్కటిగా సమకూరుస్తుంది. నూతనంగా అందిస్తున్న ఈ పరికరాలతో పేద ప్రజలకు 63 రకాల ఆరోగ్య, రక్త పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరీక్షలన్ని ఉచితంగానే ప్రభుత్వాసుపత్రుల్లో లభించనున్నాయి. గతంలో కేవలం ప్రాంతీయ, బోధన , జిల్లా ఆసుపత్రుల్లో మాత్రమే ఉండే ఈ సేవలు ఇప్పుడు పల్లె దవాఖానాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

వీటికి తోడు ఈ నెలాఖరునాటికి 103 రకాల మందులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాధమిక , పట్టణ ఆసుపత్రుల్లో లభించనున్నాయి. ప్రస్తుతం కేవలం కొన్ని రకాల ఔషధాలు మాత్రమే ఈ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ మందులు ఇతర ఔషధాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు తక్షణ చర్యలకు దిగింది. దీంతో ఎమర్జెన్సీ మందులతో పాటు కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల మందులు కూడా అందుబాటులోకి రానున్నాయి.

అందుబాటులోకి ముఖ్యమైన పరీక్షలు..

గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 63 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ముఖ్యంగా సీఆర్‌ పీ, ఎస్‌ జిఓటి, ఎస్‌ జిపిటీ, యుఆర్‌ఈఏ, హెచ్‌బి, ప్లేట్‌ లెట్‌ కౌంట్‌, సిబిసీ, టోటల్‌ బ్లడ్‌ సెల్‌ కౌంట్‌ ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌, బ్లడ్‌ యూనియా, హెపటైటీస్‌, హెచ్‌ ఐవి, డెంగీ, బ్లడ్‌ క్లాటింగ్‌ టైప్‌ థైరాయిడ్‌, సీరమ్‌ ప్రోటీన్‌ లాంటి ఖరీదైన పరీక్షలు కూడా ప్రజలకు క్లుప్తంగా లభించనున్నాయి. ల్యాబ్‌ అసిస్టెంట్లకు శిక్షణ: ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్య పరీ క్షల స్ధాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ముఖ్యంగా రక్త పరీక్షలతో పాటు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించేందుకు ల్యాబ్‌ అసిస్టెంట్లకు సమగ్ర శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ల్యాబ్‌ అసిస్టెంట్లకు 22 రోజుల పాటు శిక్షణ ఇచ్చే పనిలో వైద్య ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. ఈ నెలాఖరు నుంచి పల్లె వాసులకు ఎ ట్టి పరిస్ధితుల్లో ఈ వైద్య సేవలతో పాటు వందకు పైగా మందులను అందించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement