Saturday, April 20, 2024

గుడ్‌ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో వాహనాలు

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌) గుడ్‌ న్యూస్‌ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్‌ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. జులై మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement