Friday, October 22, 2021

సీఎం జగన్‌పై నోరుజారిన ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి నోరు జారారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే సమయంలో ప్రజలే జగన్ మోహన్‌‌రెడ్డిపై దాడి చేసే రోజులు రాబోతున్నాయంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ప్రజలపై దాడి చేయడం కాదు.. ప్రజలు జగన్‌పై తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయని నోరు జారారు. పక్కన ఉన్న నేతలు సైగ చేయడంతో మళ్లీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట మార్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News