Monday, October 18, 2021

ఏపీలో కరోనా కేసులు ఎన్నంటే..?

ఏపీలో క‌రోనా కేసులు రాష్ట్రంలో క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో 45,481 క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 765 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,52,763కి చేరింది.  ఇందులో 20,28,202 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,357 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 9 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,204కి చేరింది.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 973 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.  

ఇది కూడా చదవండి: ఏడాదిపాటు ష‌ర్మిల పాద‌యాత్ర..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News