Wednesday, March 27, 2024

అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లలో నగదు జమ

అగ్రిగోల్డ్‌లో ఉన్న డబ్బంతా కష్టజీవులదే.. ఆ సొమ్మునే కాజేయాలని చూశారని సీఎం జగన్ అన్నారు. మంగళవారం అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం నగదును జమ చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌ విధానంలో మీట నొక్కి నిధులు విడుదల చేశారు. రూ.10,000 నుంచి రూ.20,000 లోపు డిపాజిట్‌దారుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేశారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులకు రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ. 20 వేల లోపు వారికి రూ. 459.23 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 7 లక్షలకుపైగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ.666.84 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఓ ప్రైవేట్‌ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును…ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. గత ప్రభుత్వంలోని వ్యక్తుల కోసం జరిగిన మోసం ఇది అని విమర్శించారు.  అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేసే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. గత ప్రభుత్వమే కర్త, కర్మ, క్రియగా జరిగిన అగ్రిగోల్డ్‌ స్కాం ఇది అని సీఎం ఆరోపించారు. డిపాజిట్‌దారుల సంఖ్య గత ప్రభుత్వం తగ్గించేసిందన్నారు. ఎన్నికలకు ముందు జీవో ఇచ్చారని.. కానీ రూపాయి కూడా ఇవ్వలేదని జగన్‌ విమర్శించారు. గత ప్రభుత్వం బాధితులను మోసం చేసిందన్నారు. చిన్న వ్యాపారులు సైతం కష్టపడిన సొమ్మును దాచుకున్నారు. డిపాజిట్ దారుల సంఖ్య గత ప్రభుత్వం తగ్గించేసిందని చెప్పారు. ఎన్నికలకు రెండు నెలల ముందు జీవో ఇచ్చారని సీఎం అన్నారు. కానీ బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం జగన్ పేర్కొన్నారు.

కాగా, అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి దశ పరిహారాన్ని 2019లో అందించారు. రూ.10,000 లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లను జమచేశారు. అప్పుడు అర్హులైనా కూడా పరిహారం పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పుడు రెండో దశ పరిహారాన్ని అందించింది.

ఇది కూడా చదవండి: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీష్‌రావు

Advertisement

తాజా వార్తలు

Advertisement