Monday, October 7, 2024

AP తిరుమలకు వెళ్లకుండా ఎవరు ఆపారు … నీకు నోటీస్ లు ఇచ్చామా చూపించు – జగన్ కు చంద్ర బాబు కౌంటర్

అమరవతి – తిరుమల పర్యటనపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.

అమరావతి లో నేడు ఆయన మీడియా తో మాట్లాడుతూ , వేరే మతాలకు చెందిన వారు మత సంప్రదాయాలను గౌరవించాలి.

ఎవరూ కూడా జగన్‌ను వెళ్లొద్దని అనలేదు. ఈమధ్య టీటీడీలో జరిగిన పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. జగన్‌కి నోటీసులు ఇస్తే చూపించాలి. ప్రజా జీవితంలో ఉండేవారు కొన్ని సంప్రదాయాలు పాటించాలి. ఎవరైనా కొన్ని మతాలకు ఆచారాలు ఉంటాయి. దేవుడి ఆచారాలను ధిక్కరించేలా ఎవరూ ప్రవర్తించకూడదు.

- Advertisement -

తరుమల హిందువులకు అతి పెద్ద పుణ్యక్షేత్రం. హిందువులు జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. ఈ ఆలయం ఏపీలో ఉండటం మన అదృష్టం. ఈ ఆలయాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఆచారాలు పాటించకపోతే, మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. జగన్ అలా మాట్లాడటం సరికాదు””

ఇంతకుముందు జగన్ రూల్ అతిక్రమించారు. చట్టాన్ని అతిక్రమించారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తానంటే అది సరైనది అవుతుందా? కాశ్మీర్ ముఖ్యమంత్రి, ఎవరు వచ్చిన డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. బయటకు వెళ్తే జగన్ హిందూ మతాన్ని గౌరవిస్తా అన్నారు.

అంటే ఏంటి.. ఆ టెంపుల్‌కి వెళ్లినప్పుడు అక్కడి ఆచారాల్ని పాటించాలి. అలా చేస్తేనే గౌరవించినట్లు. అలా కాకుండా ఇదివరకు ఎవరూ అడగలేదు అనడం సరికాదు. నేను హిందువును తిరుమలకు వెళ్తాను. చర్చికి, మసీదుకి వెళ్తాను. అక్కడి సంప్రదాయాల్ని కూడా పాటిస్తాను.

జగన్ మానవత్వం అంటారేంటి.. అంటే.. సంప్రదాయాల్ని పాటించమంటే మానవత్వం అంటారా?”కల్తీ జరిగింది:”కల్తీనే జరగలేదు అంటున్నారు. జరగలేదు అంటూనే జరగలేదని ఈవో చెప్పారని అంటున్నారు. ఏఆర్ డెయిరీ కంపెనీ 8 ట్యాంకర్లు పంపింది. 4 ట్యాంకర్లను వాడారు. పదే పదే కంప్లైంట్స్ వచ్చాక.. మిగిలిన నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేస్తూ.. NDDB టెస్టింగ్ కోసం పంపారు.

అప్పుడు NDDB రిపోర్ట్ ఇచ్చింది. అందులో 4 ట్రక్స్ నుంచి 4 శాంపిల్స్ పంపినప్పుడు.. ఆ రిపోర్టును బయటపెట్టకపోతే, మేము తప్పు చేసినట్లు కాదా? ఇది జరిగింది. జరగలేదు అని జగన్ ఎలా చెబుతారు? జరిగింది కాబట్టే సెప్టెంబర్ 23న తిరుమలలో ప్రాయశ్చిత శాంతి యాగం చేశారు”

“వైసీపీ పాలనలో నాశిరకం నెయ్యిని వాడారు. టెండర్ పిలవడానికి కండీషన్స్ ఎందుకు మార్చారు. నాశిరకం నెయ్యిని తెప్పించి, అపవిత్రం చేశారు. అన్నదానంలో అన్నం, రూములు బాలేదనీ, ప్రసాదం బాలేదని భక్తులు ఎన్నోసార్లు చెప్పారు. అయినా జగన్.. ఇప్పుడు ఇవేవీ జరగలేదు అంటున్నారు. ఈవో చెప్పలేదు అంటున్నారు. రిపోర్టులు లేవు అంటున్నారు. మొత్తంగా చూస్తే, అన్ని ఆలయాల్లో ఇలా జరిగాయి. మొత్తం ఆలయాలను ప్రక్షాళన చేశాం.

రామతీర్థంలో రాముడి తల తీసేస్తే దర్యాప్తు లేదు. అతర్వేదిలో రథం తగలబెట్టిందెవరో చెప్పలేదు. దుర్గమ్మ గుడిలో చోరీకి యాక్షన్ లేదు. అనంతపూర్.. కనేకల్ మండలంలో.. ఈశ్వరరెడ్డి తానే రథాన్ని తగలబెట్టానని చెప్పాడు. అతను వైసీపీ వ్యక్తి. మీరు తగలబెడితే, మేము సమర్థించాలా. మత సామరస్యాన్ని దెబ్బకొడితే, మేము సైలెంటుగా ఉండాలా? జగన్‌కి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? జగన్ తిరుమలకు వెళ్తే, సంప్రదాయాలను పాటించాలి. వేరేవాళ్లపై నెపం వెయ్యకూడదు.

సంతకం పెట్టడం ఇష్టం లేదు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక ఇలా చేస్తున్నారు. అది జగన్ సమస్య””దళితులను ఆలయంలోకి ఎవరు పోనివ్వట్లేదు? ఎవరు ఆపారు? జగన్‌కి విశ్వసనీయత లేదు. చెప్పిన తప్పే చెబుతాడు. తప్పు జరిగిందని నేను చెప్పలేదు. రిపోర్ట్ చెబుతోంది. 4 ట్యాంకర్లు వాడకపోయి ఉంటే, ఇలా జరిగేది కాదు. కలియుగ దేవుడికి అపచారం జరిగింది. కల్తీ నెయ్యి వాడారన్నది నిజం. ఎక్కడ వాడారన్నది తెలియదు. అంతకుముందు నెయ్యి వాడారు. ఇప్పుడు తెలిసింది, అందుకే ఇప్పుడు రిజెక్ట్ చేశాం.

. నెయ్యి టెస్టింగ్ తిరుమలలో లేదు. ఇప్పుడు టెస్టింగ్ ఏర్పాట్లు పెట్టాం. ఇకపై ఇలాంటివి జరగకుండా చేస్తున్నాం. టీటీడీ పవిత్రతను కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అక్కడ ఆల్రెడీ డిక్లరేషన్ ఉంది. ఉన్న నిబంధనలను జగన్ పాటించాలి. దానికి సెక్యులర్ దేశం అనే మాట అక్కర్లేదు. నెయ్యి టెస్టింగ్ కోసం ఎప్పుడూ మైసూరుకి పంపలేదు.

తిరుమలలో ఎందుకు టెస్టింగ్ లేదు? అడల్టరేషన్ టెస్ట్ అనేది టీటీడీలో లేదు””తెలిసే, తెలియకో తప్పు జరిగింది, రిపోర్ట్ చెబుతోంది. జగన్ విచారం వ్యక్తం చెయ్యవచ్చు. కానీ అలా చెయ్యట్లేదు. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగినా, నేను సైలెంటుగా ఉండి, మాజీ ముఖ్యమంత్రి చేసిన పనికి శభాష్ చెప్పాలి. వాస్తవాలు చెప్పేసరికి ఆయనకు బాధ. నేను కప్పిపుచ్చలేదని నాపై కోపం. తప్పు జరిగిందా లేదా..

జగన్ తిరుమలకు వెళ్లాలి. సంతకం పెట్టి వెళ్లాలి. ఇందులో తప్పేముంది. ఎందుకు ఇదంతా? సెక్యులర్ దేశంలో ఈ చర్చ ఎందుకు వచ్చింది. ఇలాంటి నేతల వల్ల ఇదంతా. రాజకీయ ముసుగులో నేరస్థులు వస్తే ఇవన్నీ ఉంటాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన వేసిన ఈవో, జగన్ ని డిక్లరేషన్ అడగలేదు. ఇప్పుడు అడగకూడదా? జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఇదివరకు తప్పు చేశారు.

దీనిపై ప్రజలు ఆలోచించాలి. ప్రజల తరపున మాట్లాడుతున్నా. ఇది వ్యక్తికీ, పార్టీకి సంబంధించినది కాదు. సమాజ హితం కోసం చెబుతున్నాను. తప్పు చేసి, ఆ తప్పును ఒప్పు చెయ్యడానికి సోషల్ మీడియాలో పదే పదే ప్రయత్నిస్తున్నారు. అది సరికాదు. డిక్లరేషన్ ఇవ్వడం అనేది చట్టపరంగా ఉన్నది. సిట్ వేశాం. సిట్ అన్నీ తేల్చుతుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర అపచారం జరగకుండా ఉంచడం నా బాధ్యత. త్వరలో ఇంటెలెక్చువల్స్ తో ఒక మీటింగ్ పెట్టి, పవిత్రత కాపాడేందుకు ప్రయత్నిస్తాం” అని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement