Friday, April 26, 2024

AP | 13న ఏపీ మంత్రివర్గం సమావేశం.. ప‌లు కీలక అంశాలపై చర్చ

అమరావతి, ఆంధ్రప్రభ : అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ నెల 13వ తేదీన మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షత వహించనున్నారు. నూతన సీఎస్‌గా జవహర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగే కేబినెట్‌ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించడంకు సంబందించిన అంశానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. అలాగే మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి ముహూర్తాన్ని కూడా ఇదే కేబినెట్‌ భేటీ-లో నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.

ఇప్పటికే పలువురు మంత్రులు విశాఖ పాలనా కేంద్రంగా ఎపుడైనా వుండవచ్చని వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉగాది నాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రివర్గ సమీక్షించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వారి అవసరాలను తెలుసుకుంటోన్న నేపథ్యంలో దీనిపై సమీక్షకు ప్రాధాన్యత ఇవ్వనుంది మంత్రివర్గం. రాష్ట్రంలో కొనసాగుతున్న వైద్య కళాశాలల నిర్మాణం, రోడ్లు, పేదలందరికీ ఇళ్లు, నవరత్న పథకాల అమలు.. వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపు తదితర అంశాలు కేబినెట్‌ ముందుకు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement