Thursday, August 5, 2021

ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సోము వీర్రాజు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్, కేంద్ర టూరిజంశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలవనున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్రమంత్రి షెకావత్‌తో చర్చించనున్నారు. అలాగే.. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు.

మరోవైపు ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ నిపుణులు, ఇంజనీర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలను కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌కు సోము వీర్రాజు అందజేయనున్నారు. అదేవిధంగా కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డితో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధిపై ఆయన చర్చించనున్నారు. పోల‌వ‌రం నిర్మాణం ప‌రిహారం అంశాల‌పై కేంద్ర‌మంత్రుల‌తో సోము వీర్రాజు చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంపై మరోసారి కేంద్రం స్పష్టత

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News