Thursday, April 25, 2024

AP | మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ, 17న బడ్జెట్.. విశాఖ రాజధానిపై కీలక ప్రకటన ఉండేనా?

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. 17న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్యలో ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వనున్నారు.

మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జి-20 సదస్సులు జరగనున్న నేపథ్యంలో అంతకుముందే అంటే 25 లేదా 27న బడ్జెట్ సమావేశాలను ముగించనున్నారు. మధ్యలో 22న ఉగాది సందర్భంగా ఆ ఒక్క రోజు లేదా రెండు రోజుల పాటు సెలవు ఇవ్వనున్నారు. విశాఖపట్టణానికి తాను, తన కార్యాలయం తరలి వెళ్లడంపై సీఎం జగన్ ఈ సమావేశాల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని వైఎస్సార్​సీపీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement