Thursday, April 18, 2024

శృంగారం కట్టడికి ఒలింపిక్స్ నిర్వాహకుల వింత ఆలోచన

మరో నాలుగు రోజుల్లో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2021 జపాన్ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు దేశాల నుంచి అథ్లెట్లు బృందాలుగా టోక్యో చేరుకున్నారు. అయితే ఈసారి ఒలింపిక్స్‌ గతంలో మాదిరి ఉండవు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే ఓ విషయం చాలా ఆసక్తి కలిగిస్తోంది.

టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాకారుల మధ్య శృంగారం కట్టడి కోసం నిర్వాహకులు వినూత్న ఆలోచన అమలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులు ఒకరితో ఒకరు కలవకుండా, శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండేలా ఒలింపిక్ గ్రామంలోని వారి గదుల్లో తక్కువ సామర్థ్యమున్న అట్టలతో తయారుచేసిన మంచాలను సిద్ధం చేశారు. అట్టలతో తయారైనా ఇవి గరిష్ఠంగా 200 కిలోల బరువును ఆపుతాయి. కానీ కుదుపులకు విరిగే అవకాశముండేలా రూపొందించారు. ఈ మంచంపై కేవలం ఒక్క అథ్లెట్​ మాత్రమే నిద్రపోవడానికి వీలుంటుంది. మరొకరు చేరితే అది విరిగిపోతుంది. దీని వల్ల ఆటగాళ్లు శృంగారం చేయడానికి వీలుపడదు. వైరస్ కారణంగా ఇప్పటికే ఒలింపిక్స్‌ నిర్వాహకులు కండోమ్స్ పంపిణీ నిలిపేసిన విషయం తెలిసిందే. కాగా ఒలింపిక్స్ ముగిశాక అట్టలతో తయారుచేసిన మంచాలను రీసైక్లింగ్ చేసి కాగితపు ఉత్పత్తులుగా నిర్వాహకులు మార్చనున్నారు.

ఈ వార్త కూడా చదవండి: తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం

Advertisement

తాజా వార్తలు

Advertisement