Thursday, April 18, 2024

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మ‌యిల్ స్వామి క‌న్నుమూత

ప్రముఖ తమిళ హాస్య నటుడు ఆర్.మయిల్ స్వామీ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి నిన్న నందమూరి తారకరత్న 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన సంగతి మరవక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మ‌యిల్ స్వామి (57)కి రాత్రి చాతిలో నొప్పిరావడంతో వెంటనే కుటుంబ సభ్యులు పోరూర్ రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపే మయిల్‌సామీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా.. తన 39 ఏళ్ల కెరీర్‌లో మయిల్‌సామీ 200కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఆసాధారణ కామెడీ టైమింగ్ తమిళ పరిశ్రమలో ఆయనకి ‘సీన్ స్టీలర్’ అనే బిరుదుని సంపాదించి పెట్టింది. ఎందుకంటే ఆయన ఏ సన్నివేశంలో నటించిన అందరి దృష్టిని ఆయన వైపే లాగేసుకుంటారు.

ఈయన మృతిపై తమిళ సినీ నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా మ‌యిల్ స్వామి మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా తమిళసై మాట్లాడుతూ.. హాస్యనటుడు మయిల్ స్వామి అనారోగ్య కారణాలతో మరణించారనే వార్త విని బాధపడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మయిల్ సామి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement