Saturday, April 20, 2024

బెంగాలీ సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం – న‌టి బిదిషా డి మజుందార్ ఆత్మ‌హ‌త్య‌

బెంగాలీ సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. వ‌రుస‌గా సినీ న‌టులు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.
వారం కిందనే బెంగాలీ నటి పల్లవి డే చనిపోయింది. ఆ వార్త మరవకముందే తాజాగా మరో నటి సూసైడ్ చేసుకుంది. కాగా ఒకే నెలలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరో బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకుంది.ఈమె ప్రముఖ బెంగాలీ మోడల్, నటిగా గుర్తింపు పొందింది. వెస్ట్ బెంగాల్ లోని కోల్‌కతాలో తన అపార్ట్‌మెంట్‌లో కొద్ది రోజులుగా నివసిస్తోంది. కాగా అదే ప్లాట్ లో శవమై కనిపించింది. తన చావుకు గల కారణాలను తెలుపుతూ సూసైడ్ నోట్ కూడా రాసింది. మే 25న సాయంత్రం విషయం తెలుసుకున్న బరాక్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని, సూసైడ్ లెటర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బిదిషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్‌జి కర్ ఆసుపత్రికి తరలించారు. బిదిషాకి అనుభాబ్ బేరా అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో ఉన్న సంబంధం కారణంగా ఆమె కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉన్నట్లు ఆమె స్నేహితులు తెలిపారు. బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీమణుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం కిందనే బెంగాలీ నటి పల్లవి డే చనిపోయింది. ఆ వార్త మరవకముందే తాజాగా మరో నటి సూసైడ్ చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement