Tuesday, March 26, 2024

ఆర్ ఆర్ ఆర్ కి మ‌రో ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్.. రాజ‌మౌళికి విషెష్ చెబుతోన్న సినీ ప్ర‌ముఖులు

ద‌ర్శ కుడు రాజ‌మౌళి ఖాతాలో మ‌రో ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చి చేరింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మరోసారి ఇదే కేటగిరీలో సన్‌సెట్‌ సర్కిల్ అవార్డు గెలుచుకుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు రాబట్టి గ్లోబల్‌ బాక్సాఫీస్‌ ను షేక్ చేసింది. నాలుగు ఇతర ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో నామినేట్‌ అయిన ఆర్‌ఆర్‌ఆర్ ఫైనల్‌గా విన్నర్‌గా నిలిచింది. ఈ పురస్కారం రావడం పట్ల ఆర్‌ఆర్‌ఆర్‌ టీం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జక్కన్న టీంకి సినీ జనాలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రాంచరణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో నటించగా..ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్ర పోషించాడు. అలియాభట్‌, అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియాశరణ్‌, ఒలివియా మొర్రీస్‌, సముద్రఖని ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement