Wednesday, April 17, 2024

నాగ‌చైత‌న్య మ‌రో ప్ర‌యోగం.. క‌స్ట‌డీ నుండి గ్లింప్స్

హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న తాజా చిత్రం క‌స్ట‌డీ.ఈ చిత్రంలో చైతూకి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో మే 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి కస్టడీ అనే టైటిల్ ఖరారు చేశౄరు. తాజాగా న్యూ ఇయర్ కానుకగా కస్టడీ నుంచి చిత్ర యూనిట్ చిన్న గ్లింప్స్ విడుదల చేసింది.

వెంకట్ ప్రభు గత చిత్రాల మాదిరిగానే ఈ మూవీ కూడా డార్క్ థీమ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య లుక్ డిఫెరెంట్ గా ఉంది. చిన్న గ్లింప్స్ అయినప్పటికీ ఇందులో చూపిన యాక్షన్ సన్నివేశాలు పవర్ ఫుల్ గా ఉన్నాయి. చైతు ఇంటెన్స్ లుక్ లో అదరగొడుతున్నారు. గ్లింప్స్ లో కథకి సంబంధించిన ఎలాంటి క్లూ వదల్లేదు. ట్రైన్ వేగంగా వెళ్లడం.. కారు ఛేజింగ్ లు ఉన్నాయి. ఓవరాల్ గా కస్టడీ చిత్రం నాగ చైతన్య చేస్తున్న మరో ప్రయోగం అని చెప్పొచ్చు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement