Saturday, April 20, 2024

ఏపీ రాజధానిపై సుప్రీంలో మరో కేసు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయడం లేదని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్‌వలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసేలా శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని పిటిషన్‌లో మస్తాన్‌వలీ పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రీధర్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ కేసు పెండింగులో ఉంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి విచారణ జనవరి 31న జరగనుంది. ఈలోగా ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది. సరిగ్గా ఇదే సమయంలో మస్తాన్‌వలీ పిటిషన్ దాఖలైంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌కు జతచేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement