Friday, March 29, 2024

గాడ్ ఫాద‌ర్ కి హిందీలో పెరిగిన 600స్క్రీన్లు-ట్వీట్ చేసిన చిరంజీవి

గాడ్ ఫాద‌ర్ చిత్రం విడుద‌ల‌యిన రెండు రోజుల్లోనే 69కోట్ల‌ని వ‌సూలు చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ నెల 5వ తేదీన విడుద‌లైన ఈ సినిమా తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 69 కోట్లు వ‌సూలు చేసింది. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ‘లూసిఫర్’ సినిమాకి ఇది అఫీషియ‌ల్ రీమేక్. ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు హిందీలో కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. బాలీవుడ్‌లో సైతం ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రేక్ష‌కుల స్పంద‌న నేప‌థ్యంలో హిందీలో గాడ్ ఫాద‌ర్ కి ఒక్కసారిగా 600 స్క్రీన్లు పెంచారు. ఈ విష‌యాన్ని చిరంజీవి వెల్ల‌డించారు. త‌న చిత్రానికి ఇంత మంచి విజ‌యం క‌ట్ట‌బెట్టిన ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మోహ‌న్ రాజా మార్పులు చేసి ‘గాడ్ ఫాదర్’ గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో న‌య‌న‌తార‌, ప్ర‌తినాయ‌క పాత్ర‌లో స‌త్య‌దేవ్ ఆక‌ట్టుకున్నారు. బాలీవుడ్ బ‌డా హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement