Thursday, March 28, 2024

క‌రెంటుకు నో ప్రాబ్ల‌మ్‌.. వినియోగంలోకి మరో 42.5 మెగావాట్ల ప్లోటింగ్‌ సోలార్‌ పవర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రామగుండం ప్లోటింగ్‌ పీవీ ప్రాజెక్టులో మరో 42.5 మెగావాట్ల విద్యుత్‌ అమల్లోకి వచ్చింది. 100 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని రామగుండం ఎన్టీపీసీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు రెండు విడతల్లో 37.5 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ అమల్లోకి వచ్చింది. శుక్రవారం ప్రారంభించిన 42.5 మెగావాట్లతో మొత్తం 80 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి మార్గం ఏర్పడింది. 2021 అక్టోబర్‌ 28న 17.5 మెగావాట్లు, 2021 డిసెంబర్‌ 22న మరో 20 మెగావాట్ల సోలార్‌ పవర్‌ వినియోగంలోకి వచ్చింది. మిగిలిన 20 మెవాట్ల సోలార్‌ ప్లాంట్‌ను త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు ఎన్టీపీసీ అధికారులు పనులు వేగవంతం చేశారు. ముందుగా నిర్ణయించుకున్న సమయం మేరకు సోలార్‌ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి సాధించడంపై ఎన్టీపీసీ రామగుండం సిబ్బంది, అధికారులను సౌంత్‌ ఇండియా రీజనల్‌ ఈడీ నరేష్‌ ఆనంద్‌ అభినంచించారు. పునరుత్పాదక ఇంధన కోసం ఎన్టీపీసీ నిబద్ధను పునరుద్ఘాటించారు 2032 నాటికి 60 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఎన్టీపీసీ తమ లక్ష్యాన్ని వాస్తవీకరించడానికి దక్షిణ ప్రాంతం సమిష్టి ప్రయత్నాలతో ముందుకు సాగుతోంది. రామగుండంతో పాటు, ఎన్టీపీసీ – సింహాద్రి ( ఆంధ్రప్రదేశ్‌ ) ఇప్పటికే 25 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఎన్టీపీసీ- కాయంకుళం ( కేరళ)లో సమీప భవిష్యత్‌లో 92 మెవాట్ల సోలార్‌ ఏర్పాటుకు గాను పనులు సాగుతున్నాయి.

ప్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ఖర్చు రూ. 423 కోట్లు..

కాగా దేశంలోనే అతి పెద్దదిగా ఉన్న రామగుండం వద్ద ఈ 100 మెగావాట్ల ప్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పలకలు రిజర్వాయర్‌లోని 450 ఎకరాల్లో విస్తరిచింది ఉంది. ఈ 100 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి గాను ఖర్చు రూ. 423 కోట్ల ఖర్చుతో ప్లాంట్‌ను 40 బ్లాక్‌లుగా విభజించారు. ఒక్కోక్కటికి 2.5 మెగావాట్లు కాగా, ప్రతి బ్లాక్‌లో ఒక ప్లోటింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ 11,200 సోలార్‌ మాడ్యూల్‌లో శ్రేణి ఉంటుంది. ప్లోటింగ్‌ ప్లాట్‌ ఫారమ్‌లో ఒక ఇన్వర్టర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌కు ఒక హెచ్‌టీ బ్రేకర్‌ను అమర్చుతారు. సోలార్‌ మాడ్యూల్స్‌ హెచ్‌డీపీఈ ( హై డెన్సిటి పాలిథిన్‌ ) మెటిరియల్‌తో తయారు చేయబడిన ప్లోటర్‌లపై అమర్బబడుతాయి. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ బెడ్‌లో ఉంచిన డెట్‌ వెయిట్‌లకు ప్రత్యేక హెచ్‌ఎంపీఈ తాడు ద్వారా మొత్తం ప్లోటింగ్‌ సిస్టమ్‌ను ఎంకరేజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం స్విచ్‌యార్డు వరకు 33 కేవీ అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌ ద్వారా విద్యుత్‌ను తరలిస్తున్నారు. ఇన్వర్టర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌, హెచ్‌టీ ప్యానెల్‌తో పాటు స్కాడాతో సహా అన్ని ఎలక్ట్రికల్‌ పరికరాలు కూడా ప్లోటింగ్‌ ఫెర్రో సిమెంట్‌ ప్లాట్‌ఫారమ్‌లపై ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యవస్థకు సంబంధించిన యాంకరింగ్‌ డెడ్‌ వెయిట్‌ కాంక్రిట్‌ బ్లాకుల ద్వారా దిగువ యాంకరింగ్‌ ప్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో భూమి అవసరం భాగా తగ్గిపోతుంది. అయితే సోలార్‌ ప్లాంట్‌కు సంబంధించి అనుబంధ పరికరాలు తరలించడానికి మాత్రమే భూమి అవసరం పడుతోంది. నీటిపై తేలియాడే సౌర పలకాలతో నీటి వనరుల నుంచి వెలువడే భాష్పీభవన రేటు కూడా తగ్గడంతో పాటు నీటి సంరక్షణలో సహాయపడుతుంది. దీంతో సోలార్‌ మాడ్యూల్స్‌ కింద ఉన్న నీరు. వాటి పరిసర ఉష్టోగ్రతను నిర్వహించడంలోనూ సహాయపడుతోంది. తద్వారా వాటి సామర్థ్యాన్ని, ఉత్పత్తిని మెరుగుపరుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement