Thursday, March 30, 2023

కొత్త మెడికల్‌ కళాశాలలకు మరో 313 పోస్టులు మంజూరు.. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రోష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేస్తున్న 9 మెడికల్‌ కళాశాలలకు మరో 313 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల సృష్టికి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను మెడికల్‌, హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నేరుగా భర్తీ చేయనున్నారు.

- Advertisement -
   

లోకల్‌ కేడర్‌ ప్రాతిపదికన ఈ పోస్టుల నియామకం జరగాలనీ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ పోస్టులు గైనకాలజిస్ట్‌, ఆబ్‌స్ట్రెట్రిక్స్‌-45, జనరల్‌ సర్జన్‌-32, జనరల్‌ మెడిసిన్‌-33, అనస్థీషియా-22, అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలసీ, బయోకెమిస్ట్రీలో 11, కమ్యూనిటీ మెడిసిన్‌, పాథాలజీ-17, కమ్యూనిటీ మెడిసిన్‌-17 పోస్టులు భర్తీ కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement