Tuesday, April 23, 2024

తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుల స‌మ‌క్షంలో.. అనిల్ రావిపూడి బ‌ర్త్ డే

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ రావిపూడితో కేక్ కట్ చేయించి.. పుష్పగుచ్చం అందజేశారు. తన పుట్టినరోజున తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు చూపించిన ప్రేమకు అనిల్ రావిపూడి ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కష్టపడితేనే గుర్తింపు వస్తుందని, ఫొటో జర్నలిస్ట్‌లు ప్రతి రోజూ ఎంత కష్టపడతారో తనకి తెలుసని అన్నారు. ఈ అసోసియేషన్‌కు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement