Wednesday, April 17, 2024

Terrifying Video: వాహనంపై ఏనుగు దాడి.. పరుగు పెట్టిన పర్యటకులు

గజరాజుకు కోపం వస్తే బీభత్సం సృష్టిస్తుంది. ఏనుగు దెబ్బ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. సరిగ్గా ఇలాంటి ఘటనే దక్షిణాఫ్రికాలోని సెలాటిగమే రిజర్వ్ లో చోటుచేసుకుంది. సఫారీకి వెళ్లిన పర్యాటకుల వాహనంపై ఓ ఏనుగు దాడి చేసింది. పర్యాటకుల వాహనం వెళ్తుండగా దారిలో ఎదురుగా ఏనుగులు నిలబడ్డాయి. దీంతో వారు తమ వాహనాన్ని నిలిపివేశారు. అయితే, అదే సమయంలో పక్కనుంచి వచ్చిన ఓ ఏనుగు పర్యటకుల వాహనంపై దాడి చేసింది. వాహనాన్ని గుద్దుతూ బీభత్సం సృష్టించింది. దీంతో భయాందోళనకు గురైన పర్యటకులు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement