Tuesday, April 16, 2024

జగన్ సర్కారుపై మరోసారి హైకోర్టు సీరియస్

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయ్యింది. కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణకు నలుగురు ఐఏఎస్‌లు జీకే ద్వివేది, గిరిజాశంకర్, శ్రీలక్ష్మీ, విజయ్ కుమార్ హాజరయ్యారు. ఆ పాఠశాల ఆవరణలో ఇలాంటి భవనాలు నిర్మించవద్దని గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు పాటించడంలేదని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆదేశాలు అమలు చేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించింది. తాము ఆదేశించినా నిర్మాణాలు ఎందుకు జరుగుతున్నాయి అని నిలదీసింది. హైకోర్టు ఆదేశాలను సరిగా పాటించడం లేదని ఆ విషయాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయి విచారణను ఈ నెలాఖరుకు విచారిస్తామని కోర్టు వాయిదా వేసింది. అయితే దీనిపై ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఈ వార్త కూడా చదవండి: చిత్తూరు జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement