Sunday, October 17, 2021

ఏపీ సర్కారు ఈనెల అప్పు రూ.5వేల కోట్లు

ఏపీ సర్కార్ మార్కెట్‌ రుణం కోసం రిజర్వు బ్యాంక్‌కు ప్రపోజల్ పంపింది. సెక్యూరిటీల వేలం ద్వారా మొత్తం రూ.1000 కోట్లు సమీకరించనుంది. 17 ఏళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా రూ.500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ.500 కోట్లు రుణం కావాలంటూ ప్రతిపాదించింది. దీంతో సెప్టెంబరు నెలలోనే ఏపీ ప్రభుత్వం రూ.5,000 కోట్లు రుణం పొందినట్లవుతుంది. మార్కెట్‌ నుంచి సమీకరించిన రుణ మొత్తం రూ.25,751 కోట్లకు చేరుకుంటుంది.

కాగా కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల కాలానికి రూ.10,500 కోట్లు రుణంగా తీసుకునేందుకు ఏపీ సర్కారుకు సెప్టెంబర్ తొలివారంలో అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐకి సైతం వర్తమానం పంపింది. డిసెంబర్ నెలాఖరు వరకు అంటే ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల వరకు ఈ మొత్తం రుణం పొందేందుకు రెండో విడత అనుమతి లభించింది. అలాంటిది ఒక్క సెప్టెంబర్ నెలలోనే రూ.5వేల కోట్లు రుణం తీసుకోవడంతో నాలుగు నెలల రుణ అవకాశంలో సగం మొత్తాన్ని ఒక్కనెలలోనే సమీకరించినట్లు అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News