Wednesday, April 24, 2024

పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల సాయం

కడప జిల్లా మామిళ్లపల్లి ముగ్గురాయి గనుల వద్ద శనివారం జరిగిన జిలెటిన్ స్టిక్స్ పేలుడు ఘటనలో 10 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తక్షణ పరిహారంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలిపారు.

మామిళ్లపల్లె పేలుడు ఘటనపై 5 ప్రభుత్వ శాఖలతో ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఐదు రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తుందన్నారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించామని, క్వారీ లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పేలుడు పదార్థాల అన్ లోడింగ్‌లో నిబంధనలు పాటించలేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement